Viveka Panchakm anu Jeevitha Rahashyam    Chapters   

దైవతత్త్వ వివేకము

దేవుడు, ఆస్తి=కలదు అని భావించు నాతడు ఆస్తికుడు. వాని భావమే ఆస్తిక్యమనబరగు. సందేహుడు, దేవుడు కలడా?లేడా? అని సంశయించునాతడు సందేహుడని చెల్లును. దేవుడు లేడని పలుకువాడు నాస్తికుడు.

1) ప్రశ్న- What is God? దేవుడనగా నేమి? (సందేహుని ప్రశ్న)

1) జవాబు- That is God, అదియే దేవుడు. అనగా నీవు చూచునది అంతయును దేవుడే, '''దీన్యతిఇతిదేవః'' ప్రకాశించునాతడు దేవుడు. ''ఓంతత్‌ బ్రహ్మ-తదాత్మా తత్సత్యం'' ఓం కారరూపమైన శబ్దము బ్రహ్మ అదియే ఆత్మ అదియే సత్యము అని శ్రుతిపలుకుచున్నది.

(నిస్సందేహుని ప్రత్యుత్తరము)

2) Where is God? దేవుడెచట నుండెను?

2) జవాబు- God is every where, god is all. There is but one god, nothing Etc, ''సర్వంబు త్విదం బ్రహ్మనేహనా నా స్తికించన- బ్రహ్మణ్యోన్న కించన'' సర్వత్ర పరిదృశ్య మానమగు జగద్రూపమున వ్యాపించి యున్న దంతయు దేవుడే, బ్రహ్మ (పరమాత్మ) కంటే వేరొక వస్తువు లేదు. ఇచట నానారూపములు లేవు. అన్ని శరీరములలోని చైతన్యశక్తి దేవుడే. అతడు ఒక్కడు మాత్రమే సుమా! ఇతర మేదియు లేదు.

3) Who is god? దేవుడనగా నెవరు?

3) జవాబు: you are god, నీవు దేవడవు, ''చిత్‌త్వం'' ప్రకాశించు చున్నది నీవే నీవు అనెడి చైతన్యము లేనిది నీ శరీరము చింతాకంతయు చలింపజాలదు. నీవు లేకున్న నీ దేహము కుళ్లిపోవును. పురుగులు లుకలుకలాడుచు శరీరమునుంచి వెలికి వచ్చును. దుర్గంధము కలుగును. ఇతరులకు హానీ కలిగించు వ్యాధులు జనించును. నీవే నీ దేహమును కాపాడుకొను చుంటివి. ''తద్వాయుః తదాత్మా'' అది వాయురూపమున శరీరమున, లోనికి, వెలుపలకు వ్యాపించి యున్నది. అదియే ఆత్మ అతడే దేవుడు.

4) How is god? దెవుడెట్లుండెను?

4) జవాబు- god is like you, దేవుడు నీవలెనే యుండును. నీవు నీదేహాన ప్రకాశించుచున్నట్లే దేవుడు సర్వత్ర, సర్వదా, సర్వాంతర్యామియై ప్రకాశించు చుండును. నీవు ఉన్నచో దేవుడు కలడని తలచుము. నీవు లేనిచో దేవుడే లేడు. దేవుడు లేనిచో నీవే లేవని నిశ్చయించుము.

5) Show me god దేవుని కనుపరచుము

5) జవాబు- All the world is god, ప్రపంచముగా దోచునదియు, భావించునదియు, కానవచ్చునదియు, నంతయు దేవుడే. ''యద్యత్పశ్యతి చక్షుర్భ్యాంతత్తదాత్మేతి భావయేత్‌'' నీవు నీ కనుల మూలమున చూచునదెల్లయు, చూడబడినదియు, స్పృశించునదియు, వినునదియు ఘ్రాణించునదియు, రుచిని తెలిసికొనునదియు, అంతయు నాత్మయే (దేవుడే) ఆపదలు కలిగినప్పుడే దేవుడు కానవచ్చును. సంపదలు కలనాడు దేవుడు ఏమాత్రము పొడసూపడు. దుర్యోధనుడు సంపదలు కలుగుటచే దేవుడు కానరాక, వచ్చిన దేవుని (కృష్ణుని) కట్టివేయతలంచెను. పాండవులు అడుగడుగునను ఆపదలు వచ్చుటచే వారికి దేవుడు కానవచ్చుటయు, రక్షణ చేయుటయు జరిగెను. కావున ఆపదలే భగవంతుని తెలియుటకు గీటురాయి (నికషోఫలము) సుమా! నీవు సర్వదా ఆపదలను వాంఛింపుము. ఆపదలందే అతడు నీకు దర్శనమిచ్చును. నీవు కాంచగలవు.

6) Tell me qbout god. దేవునిగూర్చి నాకు తెలుపుము.

6) జవాబు- Who is talking, that is god. ''యద్వాచా పదతి తదాత్మేభావయేత్‌'' నీవు వాగ్రూపమున ముచ్చటించున దంతయు దేవుడు. నీవు భుజించునది భగవంతుడే. తలంచునది, నడచునది దేవుడే. ఆత్మకన్న వేరొక వస్తువు లేదు. ''ఆత్మనో7న్యన్నకించన'' అని శ్రుతి కలదు. సందేహము లేదు.

7) Did you see god? నీవు దేవుని చూచియుంటివా?

7) జవాబు- I am always looking the god. నేనెల్లపుడును దేవుని నేను నిన్ను చూచుచున్నట్లే చూచుచుంటిని. శ్రీరామకృష్ణ పరమహంస నరేంద్రుడను వివేకానంద స్వామితోను, శ్రీ గుడిపాటి వేంకటచలము సభయను ప్రొఫెసర్‌తోను, ''నిన్ను చూచునట్లే నేను దేవుని చూచుచున్నాను'' అని పలికిరి. కనుపించునది దేవుడని తలచినచో, నీకు కానరాని విధముననున్న దేవుడు తప్పక కానవచ్చును.

8) Can I see god? నేను దేవుని చూడగలుగుదునా?

8) జవాబు- If you have got belief about god, you must see god I say. దేవుని విషయమై నీవు విశ్వాసమును కలియున్నచో, నీవు తప్పక దేవుని గాంచగలవు. దేహభ్రాంతి యున్నంతవఱకు సంశయములు గలుగుచుండును. దేహాభిమానము నశింపగనే, శర్వసంశయములనెడి ముడివిడిపోవును. దేహసంబంధమగు ఆలుబిడ్డలు, ధనము, గృహము, ఆరామము, ''మమేదం-మమే7యం'' నాది, నావాడు అనెడి మమకారమును, మమతగల మనస్సును త్యజింపుము. దేవుని దర్శింపగలవు. దేవసందర్శనమునకు అహంత-మమతలు ముఖ్యావరోధకము లగును సుమా! వాంఛారాహిత్యమే దేవుని సందర్శింపజేయును.

ట్రూత్‌=సత్యముకన్న వేరొక రిలిజియన్‌=మతము గొప్పదిలేదని చెప్పెడి ఆర్యసమాజమో, లేక బ్రహ్మసమాజమో కలదు. కాని ''సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ'' అను శ్రుతి సత్యమే గొప్పది, అదియే జ్ఞానము అనంతము ఆనందము అని తెలుపుచున్నది. ''రాజసూయంబులు వేయును, ఒక్క సత్యమును ఇరుగడలందుల నిడి తూపగ సత్యము వలననె ములు సూపె గౌరవంబున బేర్మిన్‌'' అని భారతము పలుకుచున్నది. మరియు ''ఒరులెయ్యది యొనర్చిన తనకు అహితంబగునో దానిని ఒరులకొసంగమి పరమధర్మమండ్రు నరేంద్రా'' యనుచు ధర్మస్వరూపమును భారతము తెలుపు చున్నది. కాన ధర్మము, సత్యము, భగవంతుని రూపము. దాని నన్వేషించు మతమే సర్వసమ్మతమైన మతమనిభావము. శ్రుతియందులేని క్రొత్త సత్యమతముగాని, ధర్మమతముగాని కానుపించదు. శ్రుతివిహిత మతమే వైదికము. అద్వైతము శ్రేష్ఠతమము.

1. సత్యేనసృజతేలోకం-సత్యేన వర్ధతమే జగత్‌

సత్యేనలీయత్‌ సర్వం-సత్యే సర్వం ప్రతిష్ఠతం||

2. సత్యేన వసుధాభాతి-సత్యేనాగ్నిః ప్రకాశ##తే

వాయుశ్చలతి సత్యేన-సత్యేనమేఘా వర్షంతి|

3. సత్సాత్ర్వవహంతి నద్యః-సత్యేవిరాజతెనభః

సత్యేన మేఘావర్షంతి-సత్యాద్భాతి సభోమణిః

4. సత్యాత్ఫలంతి సస్యాని- సత్యేన జీవా జీవంతి

సత్యే సత్యం సుఖం శివం- సర్వం సత్యేప్రతిష్ఠతం||

5. నహి సత్యాత్పరో ధర్మః- సత్యాదన్యన్నకించన|

సత్యం జ్ఞానం సత్యం బ్రహ్మ- సత్యం సుఖం సత్యంశివం|

సత్యేన వర్ధతేహ్యాయుః- తస్మాత్సత్య ముపాస్యతాం.

9) Do you see god? నీవు దేవుని చూచుచుంటివా ? (అని గురుని ప్రశ్న- అనగా అంత్యపరీక్ష)

9) శిష్యుని జవాబు. yes, I see god sir. గురుజీ! నేను దేవునిపుడుగాంచగలిగితిని. ''తదహం-తదహం-తదస్మి-ప్రభో'' అది నేను. ప్రభుజీ అదియే నేను. ''జ్ఞానస్వరూపో7హమస్మి'' జ్ఞాన స్వరూపుడనైతిని. ''ధవ్యో7హందన్యో7 పునఃవునర్ధన్యః'' ధన్యుడనైతిని. కృతార్థుడనైతిని. ''సద్గురు కృపాయ బ్రహ్మైవాహంసదా'' సద్గురు కృపాకటాక్షము చేతను, బోధనము చేతను నేనెప్పుడును బ్రహ్మమునే. ''జీవోదేవ స్సనాతనః'' జీవరూపమున ప్రకాశించు చైతన్యమే దేవుడని గ్రహింపగలిగితిని. నేను అని వచించెడి చైతన్యమే దేవుడు. అతడే నేను అని పలుకుచు తెలుపుచుండెను.

నేనన నేమి?

1. నేను నేనన, మేనును- నేనుగాను (గానునేను)

ఏను మేనుకు వ్యతిరిక్త-మైన చేత

నమ్ము, మేనును నేనని- నమ్మబోకు

మఱయ నిర్గుణ బ్రహ్మంబు- నగదుసుమ్ము

2. నేను మేనును ప్రాణంబు-గాను సుమ్ము

నేను నేత్రముల్‌ శ్రోత్రముల్‌-గాను నమ్ము

నేను జిహ్వయు ఘ్రాణంబు-గాను (సుండి) సుతుడ.

నేను చర్మంబు పాయువు-గాను సుమ్ము

3. నేను పాదముల్‌ పాణియు-గాను నమ్ము

నేను వాక్కు నుపస్థయు-గాను (నరయ) సుమ్ము

నేను మనమును బుద్ధియు-గాను (నమ్ము) తండ్రి.

నేను చిత్త, మహంకృతి-గాను నన్ను

4. గాన నిష్కల బ్రహ్మంబు-గానెరుంగు

నీవు, బ్రహ్మమే సతతంబు- నిజము (గనము) శిష్య

నీవు నేనును బ్రహ్మమే- నిజము (సుమ్ము) కుఱ్ఱ

నీవు నేనును దేవుడే- నిజము పుత్ర.

1. దేవుడు లోకము (జగము)న, జరుగుచున్న అన్యాయము, అక్రమము, అసత్యము, అసహనము, అధర్మము, అపకారములను చూచి నివారింప యత్నించువారు కాన తానందున, సప్త ధాతువులనెడి సప్తగిరులతోను, సప్త సోపానములతోను గూడిన దేహమనెడి పర్వత మందలి హృదయమనెడి గుహాలయము నందు డాగి నివసించుచుండెపో. అట్లు దాగి కొనియున్నను, ప్రజానీకము వాని వెంటబడుచు మ్రొక్కులను పేరునను, పాపనాశ క్షేత్ర సందర్శనమునకుగాను తిరుగాడుచునే యుండిరి. (కలియుగ దేవుడు వెంకట నాయకుడు)

2. దేవుడు దేహమనెడి అంధకార బంధురమగు అవిద్య=అనాత్మ=మాయ అనెడి అరణ్యమయ పర్వతమున ఆ స్తరణోపస్తరణములోగాని లేని ఏకాంత స్థలమగు నంతరంగ దహరాకాశమున దివ్య మంగళ విగ్రహుడై తపంబొనర్చుచుండెను. అట్లున్నను పాతాళగంగ స్నానాపేక్షతో దానిని ప్రజలు వెంబడించి పోవుచుండిరి. (శ్రీగిరీశుడు)

3. నిరవధికోర్మిమాలా కులంబై స్థిమితము గానక సంసార సాగరమును బోలు క్షీరాబ్ధియందు పాప పాన్పుపై పద్మనాభుడు పవ్వళించి గాఢ సుషుప్తియనెడి యోగ నిద్రావశుడై యుండెను. (క్షీర సాగర శయనుడు). అట్లున్నను, ప్రజలు ఆ. కా. మా. వై పూర్ణిమల యందు సాగర స్నానాపేక్షతో వానిని వెంబడించుచుండిరి.

4. దేశసౌభాగ్యభిలాషులగు నాయకులు సత్యము, అహింస అను రెండు సూత్రములను ఆధారముగగొని, ప్రవర్తించుచుండుమని బాలగంగాధరునివంటి మోహనదాసు వంటి ఋషులు బోధింపసాగిరి. కాని రానురాను వారి అనుయాముల కాలమున, వర్ణప్యత్యాసమున, అహింస అను పదములోని అగ్ర్యమగు 'అ' అనువర్ణము సత్యము అను పదమున కగ్రభాగమున లయించి అసత్యము, హింసలుగా మార్పు చెంది వాని ప్రభావము పెచ్చు పెరిగిపోవుటను చూడ లేక బాపూజీ గతించిరి. బాపూజీ ఇప్పటివఱకు జీవించినచో అన్యునకు శ్రమకలిగింపక తానే స్వయముగా ఎంతయో ఘోషించి బలవన్మరణముపాలయ్యెడివాడుగదాయని కాలము చెప్పకయే చెప్పుచున్నది.

5) అక్షరజ్ఞానము లేని రోజులలో, స్త్రీలు, పురుషులు, బాలబాలికలు, పామరులు, పాటక జనులు, పెద్దలు తెలిపిన ధర్మసూక్తులను గుర్తించుకొని, మననముచేయుచు ప్రవర్తించెడివారు. వీధిబడులున్న రోజులలోను, గురుకులాశ్రమములున్న రోజులలోను, అక్షర జ్ఞానవంతులు, గురు వేదాంతవాక్యము లందు విశ్వాసముంచి, పూజ్యులయం దనురాగము గలిగి ప్రవర్తించెడివారు. 1. ప్రస్తుతము మూడు (మైళ్ళకు) కిలోమీటర్లకు నొక ఉన్నత పాఠశాలయు, ఆరు కిలోమీటర్లకొక కళాశాలయును, నూరు కిలోమీటర్లకొక విశ్వవిద్యాలయము వంతున దేశమంతయు వెలయుటచే, భక్తి, శ్రద్ధ, జ్ఞాపకశక్తి, విజ్ఞానము, వినయము, విధేయతలును, సంపూర్ణముగ లోపించి, అల్లరులు, ఆగములు, సమ్మె (స్ట్రయికు)లు చేయని తరగతిగాని, సంవత్సరముగాని, విద్యాలయముగాని, ఉన్నత పాఠశాలగాని, కళాశాలగాని, కానరాకయున్నది. 2 రక్షక భట వర్గము, శాఖాధికారుల సంఖ్యయు పెరిగిన కొలదియు, ప్రజలలోని భయభక్తులు తగ్గి పగలే రాక్షస హింసాకృత్యములు పెరిగినవి. 3. విద్యా శాఖాధికారులు హెచ్చిన కొలదియు, అవిద్య, అక్రమము, అసత్యము, అవిధేయత, అమర్యాద, అవినయము, అగౌరము, వృద్ధినొందుచున్నవి. 4. న్యాయవాదుల న్యాయస్థానముల సంఖ్య హెచ్చిననూ ఇలలో, ధర్మము, న్యాయము, సత్యములకు నిలువ స్థానమే మృగ్యమయ్యెను. ఇదియంతయు, కలికాల ప్రభావముగాక వేరేమి కలదు?

కావున, ఓటరు మహాశయులు తమ ఓట్లను విక్రయించుకొనక, సమర్థులగు న్యాయమూర్తులను, న్యాయమార్గ వర్తనులను, ఎన్నుకొనియు, దేశమును సుపరిపాలనము, సుభిక్షమును పొందునట్లు ప్రజలు వర్తింతురుగాక! వ్యవసాయ శాఖ హెచ్చినకొలది, రసాయనిక ఎరువుల రకములు పెరిగిన కొలది, సేద్యగాండ్రు వ్యవసాయ వ్యయములకు చాలని పంటలమూలమున, దేశమున క్షామదేవత తాండవించుచున్నది. భూమి నిస్సారమై, పంటలందును, పాలయందును బలములేక వ్యాధులు పెరిగి మందుల అంగడులు, వైద్య బృందములు హెచ్చి ప్రజలు ధనా భావమున పీడింపబడుచుండిరి విజ్ఞాన శాస్త్రము పెరిగినకొలదియు, ప్రజలలో డామరత్వము దోపిడీ నృత్యము చేయుచున్నవి. సత్యమార్గవర్తలనుకును, న్యాయమార్గ వర్తనులకును నిలువనీడ కానవచ్చుటలేదు.

నా స్తికత. దేవుడు లేడు (నాస్తి=లేడు) అనువాడు నాస్తికుడు. వాని భావము నా స్తికత యనబడును.

God is No where, దేవు డెచ్చటను లేడు. అని పలుకువాడును, There is god now here, దేవుడు ఇపుడు ఇచటనే కలడు. అని పలుకువాడును god=దేవునే స్మరించుచుండిరి. దేవుడు ఉండెను అనునాతడును, దేవుడు లేడు అనునాతడును యుభయులును దేవునే తలంచుచుండిరి. ఎందుచేతననగా, ఉభయులలోను వ్యాపించి ప్రకాశించు దైవమే అట్లు ధ్వనించుశక్తిని కలుగచేసెను. కాన ఉభయులును సమానులే.

నా-నరౌ-నరః ఇట్లు నృశబ్దము, బుకారాంతము. ప్రథమైక వచనము. నా, అని తెలియుచున్నది. నరః- నరే-శరాః అని నరశబ్దము అకారాంతము, నరః ప్రధమైక వచనమని తెలియుచున్నది. నా, నరః అను రెండు పదములును ప్రథమైక వచనములే. జీవుడు అనునర్థమును తెలుపుచున్నది. నా+అస్తి=నా స్తి=జీవుడుకలడు అని అర్థము కలడని అంగీకరింపరు. దేవుడు లేడు అనియే గట్టిగా వచింతురు. వ్యష్టిగత దేహముననున్న చైతన్యము ''జీవుడు'' అనియు, సమష్ఠిగత దేహములందుగల చైతన్యము ''దేవుడు'' అనియు ప్రకాశించునాతడు అనియు అనంబడును. అధిష్ఠున చైతన్యము లేనిది, న్యష్టిగత దేహమును గాని, సమష్టి దేహమును గాని, చలింపజాలవు. ముచ్చటింపజాలవు ''జీవోదేవస్సవాతనః'' జీవుడే వనాతనుడగు దేవుడు. ''జీవేబ్రహ్మైపన్నానరః'' జీవుడే, బ్రహ్మము. అతడు మరియొకడుకాడు. దేవునకే బ్రహ్మమని నామము. గొప్పవాడు గనుక అనామము ఏర్పడెను. వ్యవహారబోధకు నామము నేర్పరచిరి. కాని దేవునకు నామము గాని, రూపము గాని, లేని కేవల చైతన్యము నిర్మలుడు అని భావము కాన సర్వంతర్యామిగానున్న చైతన్యమే దేవుడనబడును. ఎలెక్రిక్‌ పవర్‌ (విద్యుచ్ఛక్తి) లేనిది, రేడియో పాడదు. పలుకదు. ఫేనువీచదు. ఫోను వినిపించదు. దీపము వెలుగదు. యంత్రముయొక్క ఇంజను చలింపదు. ట్రామ్‌బండి నడువదు. కటింగ్‌ మిషన్‌ కత్తిరింపదు. కోతయంత్రము కోయదు అట్లే చైతన్యమగు పరమాత్మలేనిదే, వ్యష్టిగత దేహము నోరు మాటాడదు. చెవివినదు, ముక్కు ఘ్రాణింపదు. పాము చలింపదు, చేయు స్పృశింపదు. నాలుక రుచిని గ్రహింపనేరదు సుమా! ఇంద్రియములు పని చేయుటకు ఉపయోగించు శక్తియే దైవమని నమ్ముము. నమ్మకము=విశ్వాసము లేనిది, విశ్వాసుడనగుదువు సుమ్ము! విగతమైన శ్వాస ప్రశ్వాసములు గలవాడివగుదువు అని భావము. చైతన్యములేని వాడవగుదువు సుమా! ఆ ఆస్తిక్యముతో మొలంగుమని భావము. మహమ్మదీయ (ముస్లిము)లలోను సర్వేశ్వరమతస్థు (క్రైస్తవు)లలోను, హిందువులలోవలె నా స్తికులు కానరారు.

ఒకప్పుడు ఆ స్తికులకంటె నా స్తికులే గొప్పవారు (ఉత్తములు) అయియుందురని తోచును. కారణమేమనగా:- ఆ స్తికులు దేవుడు కలడని మన పెద్దలు (పూర్వులు) కనుగొని తెలిపిరి. చక్రిసర్వోపన గతుండని ప్రహ్లాదుడు నుడివియే యుండెను. కాన మనము ప్రత్యక్షముగ వెదుకన్కరలేదని తలచి యుపేక్షించును. దైవము లేదని తలంచిన నా స్తికులు కనుపించువఱకును, హిరణ్యకశిపుని వలెను, రావణునివలెను, కంసునివలెను, శిశుపాలునివలెను దేవుని బాగుగా వెదకి పరిశోధించి తెలిసికొనగలుగును. రావణునివలె దేవుడు తన వద్దకువచ్చు వఱకు యత్నించును. కాన రాజస, తామసములచే నా స్తికులు కనుగొన యత్నింతురు. పరిపూర్ణ సాత్వి కులుగానుండి ఆ స్తికులు దేవునికే యత్నింతురు దేవదానవ మానవులు దేవునిలో నిమిడియున్న వారలే. వారివారి గుణకర్మానుసారముగ ముందుగ కొందరును, వెనుక అనగా పిమ్మట కొందఱును కనుగొనుచుందురు. తుదకు దేవునిలో లీనమగుదురు. దేవుని కనుగొని తుదకు బంధ విముక్తులగుదురు.

''కో7హం! ము క్తిం కధం? కేస సంపార ప్రతిపన్నవాన్‌? ఇత్యాలోచన మర్ధజ్ఞ స్తపశ్శంసతి. పండితాః'' ఇతి. నేనెవరు? కర్తృత్వ భోక్తృత్వ మెందుమూలుము నాపై వైచికొంటి? ఈ జనన మరణ రూపమగు సంసారము ఎందుచేత నేను పొందితిని? ఇది ఎట్లు వదలి భాధా విముక్తుడనగుదును? అనెడి నిరంతరాలోచనమును, అర్థము నెరింగిన పండితులు అగు జ్ఞానులు తపస్సు తెలుపుచుందురు. ''తపసా బహ్మచర్యేణం యజ్ఞేన, దానేన'' తపస్సుచేత అనగా నిరంతర సదన్వేషణము చేతను, సర్వవిధముల స్త్రీని తలచక బ్రహ్మచర్యమునవలంబించుట చేతను, దేవతాసంతోషకర సత్కార్యములను చేయుటచేతను, తనకున్నంతలో భగవత్ప్రీతిగా పేదసాదలకును అర్హులకును, విజ్ఞులకను దానము చేయుట చేతను ఆత్మవస్తు సాక్షాత్కారము గలిగి తనను తాను తెలిసికొనెడి జ్ఞానము గలుగును. జీవాత్మమూలమున పరమాత్మను తెలిసికొనినచో ఆత్మసాక్షాత్కారించును.

''సంధ్యాశ్రీ'' దారకాచార్యుని, మైలవరమునందలి, గాయత్రీ తపోవనమున నిరంతర నిరవధిక తపోరూపమగు కృషి ఇదియేయని మనవి.

Viveka Panchakm anu Jeevitha Rahashyam    Chapters